నీకోసం

జనవరి 13, 2008

ఒక వ్యక్తిని ప్రేమిస్తూ, తను ప్రేమించిన వ్యక్తి తనను ప్రేమించడం లేదని మనసులోనే కుళ్లిపోయేవారు కొందరైతే, తమ ప్రేమను ధైర్యంగా ప్రేమించిన వ్యక్తికి తెలియజేసి ఎలాగైనా తన ప్రెమను సాధించుకునే వారు కొందరు.  ఈ రెండవ కోవకు చెందినవారు తన ప్రేమను సాధించుకోడానికి తను ప్రేమించిన వ్యక్తిని ఎలా సాధించుకుతింటారో చూద్దాం:

ప్రేమ లేదా
ప్రేమించలేవా
మనసు లేదా
మన్నించ లేవా
కల్లో
నీ ఒళ్లో
కౌగిళ్లో
వెన్నెల్లో
నాతోనే ఉన్నావు కాదా….. ప్రేమలేదా

ఊ అంటే అదృష్టం నీదేలే
నో అంటే నీఇష్టం కష్టంలే
నచ్చి నిన్ను కోరితే బెట్టు చేస్తుంటావే
మెచ్చి నిన్ను చేరితే మూతి ముడుచుకుంటావే
మిస్సు మనస్సు తెలుస్సు కోవా……. ప్రేమలేదా

సిటీ ఔట్ స్కర్ట్స్ లో ఫ్లాటే కొన్నానే
నీకోసం కిడ్డీ బాంకులో డబ్బే దాచానే (చెలియా)
నువ్వు నన్ను కోరితే స్వర్గాన్నే దించనా
నువ్వు నన్ను చేరితే సర్వం నీ ధ్యానా
మిస్సూ నాకే మిస్సెస్సవ్వవా…….ప్రేమలేదా

మనసంతా నువ్వే నువ్వేనే
సఖియా నువ్వు నాకు నచ్చావే
ఈ ఘర్షణెందుకే ప్రెమించుకుందాం రా
మనసు మాట వినకుంది ప్రేమతో రా
మిస్సూ ఎస్స్ ఎస్సనెయ్యవా……. ప్రేమలేదా


అందం

డిసెంబరు 29, 2007

కళ్ళు తిప్పుకోలేని అందమా
కలల్లోకి వచ్చేటి అందమా
గొంతు దాచుకోలేని రాగమా
గుండె దాచుకోలేని ఆనందమా
ఎవరే…
నీవెవరే…
ఎదురై
నా మనసే దోచావే… కళ్ళుతిప్పుకోలేని అందమా

తన కొన అధర దరహాసమే
ఎనలేని వాసంతమే
చెలి సొగసు సౌందర్యమే
మృధు లలిత లావణ్యమే
తన నవ్వులో ఓ వెల్లువా…
ఆవెల్లువే నన్నల్లగా…
మై మరచి పోయానురా… కళ్ళుతిప్పుకోలేని అందమా


Lets go Brother

జూన్ 25, 2007

ఉపోద్ఘాతం:
చాలా బహుళ జాతి కంపెనీల లాగే నేను పని చేసే కంపెనీలో కూడా వార్షికానికి మూడు సార్లు పిక్నిక్ కి వెళ్ళే ఆచారం వుంది.  మరి ఇలాంటప్పుడే కదా మనకున్న పైత్యాలను అందరికీ చూపించే అవకాశం.  మూడు వారాలకు ముందే ఆ పైత్యాన్ని పేపర్ మీద పెట్టేశా.  ఇప్పుడు మీముందు పెడుతున్నా.

జీవితంలో వుండే అన్ని ఆనందాలనూ రుచి  చూస్తూనే, భవిష్యత్ నూ బాగా తీర్చిదిద్దుకోవాలి అని చెప్పడానికి ప్రయత్నించాను. 

అన్నట్ట్లు ఈ పాటకు మంచి ట్యూను కూడా చేసానండోయ్. ఒకసారి వీలు చూసుకుని మన బ్లాగు మీటింగుకి వచ్చి మిమ్మల్ని కూడా విసిగించాలని వుంది.  ఇక పాట చూడండి మరి… 

Let’s go brother… Let’s go brother
Let’s do it brother… do it brother

Win to win మా stratagy
One to one మా పారడీ
ఇంటా బయటా be ready… ready..

చిన్నా పెద్దా లేదురా
మనమే మనకు పెద్దరా
నింగే నీకు హద్దురా.. చెలరేగరా…… Let’s go brother

ఈ వయసులో మిస మిస మిస్సవ్వకూ
నీ భవితకూ బీటలూ పడనివ్వకూ

అహ Disco అంటే be ready
దేవుడి గుడికి we ready
ఏ ఒరవడికైనా మేం ready… ready…

అమ్మడికోసం బీటేస్తాం
మా అమ్మ ప్రేమకై పడి చస్తాం
ఈ జన్మకి ఏదో సాధిస్తాం… నేస్తం..           Let’s go brother

నీ జీవితం చరితలో నిలవాలిరా
ఈ యవ్వనం ప్రేమలో కరగాలిరా

అహ తకధిమి తకతక థై థై
నీకు నచ్చిన చిందే వేసెయ్
ధిరికిట ధీంతన థోం థోం
ఇక చిందర వందర చేసెయ్… చేసెయ్..  Let’s go brother


మౌన వీణ రాగం

జూన్ 11, 2007

మౌన వీణ రాగం
తన మేనిలోని సోయగం
ఉదయ సుప్రభాతం 
తన మాటలోని మంత్రం


వేకువ వాకిటి ముగ్గులా

ఏప్రియల్ 29, 2007

వేకువ వాకిటి ముగ్గులా
సాయం సంధ్యపు పొద్దులా
జాబిలి ముద్దుల చెల్లిలా
నను మైమరపించిన వెన్నెలా
ఐ లవ్ యు లవ్ యు రా……

ఒకపరి నవ్వుల పువ్వులా
తదుపరి కోపపు ఝల్లులా
యోచనకందని చందనా
నన్నూరించకే వందనా
నే నేనేనా నువ్వయ్యానా….

తలపులు తాకే వేళ
మది తలుపులు వేస్తావేళ
కళ కళలాడే కవితా
మరి కవ్వించకే మ్రధులలితా

వేకువ వాకిటి ముగ్గులా
సాయం సంధ్యపు పొద్దులా
జాబిలి ముద్దుల చెల్లిలా
నను మైమరపించిన వెన్నెలా
ఐ లవ్ యు లవ్ యు రా……
 


సిరిమల్లె

ఏప్రియల్ 29, 2007

కలికి ముత్యాల వానా
ఒకపరి నవ్వితే సోనా
మది పులకరిస్తుంది లోనా మనసులోనా
     
     సిరి మల్లె చిన్నారి వీణా
     సిరి మువ్వలా కదిలి రానా
     సుమగంధమై అల్లుకోనా నీ సొగసులోన 
    
చిరుగాలితో పులకరింత
తెలవారులూ నీ పలవరింతా
సరికొత్తగా ఉంది ఈ వింత ఏమిటిదంతా?


మనసు మనసు పెనవేసి

ఫిబ్రవరి 19, 2007

మనసు మనసు పెనవేసి
పెదవి పెదవి జతచేసి
   కన్నులు నాలుగు మూసేసి
   కడపటి అంచులు దాటేసి
నువ్వూ నేనూ మనమయ్యే ఆ క్షణమే
తనువూ అణువణువూ ఒకటయ్యే పరవశమే
  యుగాలైనా క్షణాలయ్యే
  సరాగంలో తడిసి… తడిసి…   మనసు మనసు పెనవేసి

జాజులు నలిగే జాములో
మోజులు తీరే రేయిలో
హద్దులు మీరిన పరువమా
సిగ్గులు తొడిగిన చైత్రమా  
    వద్దకు రానని మారమా
    నను హత్తుకుపొమ్మని దూరమా…. మనసు మనసు పెనవేసి

ఎదలో దాచిన ఊసులు
పెదవే దాటని ఆశలు
నిలువెల్ల తడిమే శ్వాశలో
అణువణువూ మురిసే ధ్యాసలో
    సర్వం మరిచే యాత్రలో
    నీలో సగమై నిలిచే రాత్రిలో… మనసు మనసు పెనవేసి   
   


పూసే పువ్వుకు ఎందుకె సిగ్గు

ఫిబ్రవరి 19, 2007

పూసే పువ్వుకు ఎందుకె సిగ్గు
సిరు బుగ్గలలోన ఎందుకె నిగ్గు
     అరవిరిసిన అందం అందని ఎత్తు
     విరబోసిన మనసుకు లేదే హద్దు
ఉహలకందని ఆశలే ఇద్దూ………. పూసే పువ్వుకు ఎందుకె సిగ్గు

రెక్కలు తొడిగెను పువ్వులే
ప్రేమే పండెను ఇక నవ్వులే
వయసే దాచెను వలపులే
మనసంతా నీకై తలపులే
      దూరమే నిట్టూర్పులయ్యి
      భారమే పెరిగెనే
      ప్రాణమే నీ చెలిమి కోసం
      ధ్యానమే చేసెనే
వెల్లువైన ప్రియసఖి అల్లరిలో… పూసే పువ్వుకు ఎందుకె సిగ్గు

వెన్నెల చీకటి మనకే
వన్నెలు దాచకు పలుకే
సిగ్గుల మొగ్గవి కాకే
నులి వెచ్చని కౌగిలి నీకే
      శ్వాశలోని వేడి దాడి
      ఆశలే పెంచెనే
      చెప్పలేని భాషలోన
      భావమంతా కరిగెనే
అల్లుకున పిల్ల ప్రియబిగిలో……పూసే పువ్వుకు ఎందుకె సిగ్గు  
        


తుళ్ళిపడే వయసే మాది

డిసెంబరు 10, 2006

తుళ్ళిపడే వయసే మాది
వెళ్ళువయె మనసే మాది
ఎల్లలను దాటి
నింగికెగసేసి
తారలై మెరిసే వరసే మాది          తుళ్ళి పడే

ఉడుకు దుడుకు ఉన్న చురుకున్న కుర్రాళ్ళం మేము  
సమత మమత ఉన్న మనసున్న మంచోళ్ళం మేమూ
  చేయి చాచితే ఆదాన కర్ణులమే మేమూ
  ఆచేయె లేపితే చెలరేగే శూరులం మేమూ 

ఉల్లాసం ఉంది ఉత్సాహం ఉంది మనసే పడితే గెలిచే ఆరాటం ఉందీ…..   తుళ్ళి పడే 

మేమెన్నుకున్నరంగం రణరంగం ఏరంగమైనా
ఇక మిన్నకుండకుండా వీరంగం సాగించలేమా
  సమరమే వద్దంటే సామ్రాజ్యం నీ సొంతమవునా
  సాహసం లేకుంటే యువరాణి నీ రాణవునా……

దమ్మూ ఉందీ ధైర్యం ఉందీ మనసే పడితే గెలిచే ఆరాటం ఉందీ….       తుళ్ళి పడే


పెదవే దాటని మాట

డిసెంబరు 4, 2006

ఎదల్లో మాట పెదాల్నే దాటదే…  చెలియా
ఒకే ఒక మాట నీతో చెప్పలనీ…  మనసు
సదా నీ వెంట పదా అంటున్నదే……

    ఉన్నచోట ఉండకుండా   
        మిన్ను దాటి అందకుండా
        రెక్కలున్న గువ్వలల్లే
        ఒక్క క్షణం నిలువకుండా
సదా నీ వెంట పదా అంటున్నదే…… 
ఒకే ఒక మాట నీతో చెప్పలనీ…  మనసు

గుండె నిండ నిండి నువ్వు
ఎండలోన నీడైనావు
అలసి సొలసి ఉన్న వేళ
నీ ఊసు చాలు ఉషారివ్వదా
    నా పాటలోన పల్లవే నువ్వూ
    నా ఆశలన్నీ కలిపితే నువ్వూ   అయినా  
                                      ఎదల్లో మాట పెదాల్నే దాటదే

మేలుకునే ప్రతి ఉదయాన
నన్నల్లుకున్న నీ ప్రియ ధ్యాన
చెసుకునే ప్రతి పనిలోన
నిను చూసుకున్న నా జతలోన
     నా పెదవిపైన నవ్వువూ నువ్వే
     నా కళ్ళలోన వెలుగువూ నువ్వే      అయినా
                                            ఎదల్లో మాట పెదాల్నే దాటదే