స్నేహమాధురి స్వరాల లాహిరి
నీ పలకరింపు తోనె నన్ను పులకరించనీ
హృదయ నిచెలి
సవినయ కోమలి
నీ చెలిమి చలువలోనె నన్ను సేదతీరనీ
స్నేహమధురి
వెనక జన్మలోన ఉన్న తీపి గురుతునీ
నిన్న నేడు రేపు లేదు మరచిపొమ్మనీ
నాకు నువ్వు తోడువన్న ఊహ నిజమనీ
నన్ను నేను మరచి పోయి పాడనివ్వనీ
స్నేహమధురి
ఇంత అంత ఎంత ఐన అంతు లేదనీ
ఇంక ఏదొ అడుగుతున్న మనసు కొరతనీ
తీర్చలేవ మార్చలేని పిచ్చి ఆశని
దరి చేర రావ వేచి ఉన్న గుండె గూటినీ
స్నేహమధురి
చేరలేని దూరమున్న నీ చెలిమిని
చేరుకోను దారిలేక దూరమైతిని
మరు జన్మకైన మాట నిలుపుకుంటావని
మనసునంత మాయ చేసి రాయినైతిని
స్నేహమధురి
3:22 అపరాహ్నం వద్ద అక్టోబర్ 28, 2006
బాగుంది, బ్రహ్మం. తెలుగు బ్లాగు లోకానికి సుస్వాగతం!
10:21 పూర్వాహ్నం వద్ద నవంబరు 12, 2006
Ur songs are really good
10:47 పూర్వాహ్నం వద్ద నవంబరు 18, 2006
Chala bagundhi andi mee paata….very inspiring song for everone
Telugu lo intha manchi sahithayam tho kudina paatalu chaala aruduga oontunayi
manchi inspirational song rasinanduku chaala chaala Thanks
meeru manchi manchi paatalu ilaane rasthuvuntaru ani aasisuthu……Bhavani
7:39 పూర్వాహ్నం వద్ద నవంబరు 24, 2006
Really fantastic and marvellous.
No words for ur appreciation.