నా హృదయమా

హృదయమిలా ప్రతి ఉదయంలా
నీ కోసమే అది విరిసినది
  నీ ధ్యాసలోనే…  నేనన్నది లేనన్నది
                              నిజమిది….
                             హృదయమిలా….
పరువంలో పరిమళమే పదిలంగా దాచానే
పరిచయమే లేనట్టే పొంకాలే పోతావే
పరువంలో పరిమళమే పదిలంగా దాచానే
పరిచయమే లేనట్టే పొంకాలే పోతావే

వానవిల్లువా తేనె జల్లువా
మౌన దేవతా మనవి తీర్చలేవా??
                            కాదనక….
                            లేదనక…
                               అవుననవా….
హృదయమిలా ప్రతి ఉదయంలా
నీ ధ్యాసలోనే నేనన్నది లేనన్నది
                              నిజమిది….
                             హృదయమిలా…
అనుదినమూ నీ నామం జపమాలై జపించానే
అణువణువూ నీకోసం తపస్వినై తపించానే
అనుదినమూ నీ నామం జపమాలై జపించానే
అణువణువూ నీకోసం తపస్వినై తపించానే

నీలవేణివా కృష్ణవేణివా    
రాగమాలికై నా రాగమందుకోవా??
                            కాదనక…
                            లేదనక…
                               అవుననవా….
                            హృదయమిలా…

9 స్పందనలు to “నా హృదయమా”

  1. anoosha అన్నారు:

    its romantic

  2. anoosha అన్నారు:

    its nice and romantic

  3. radhika అన్నారు:

    caalaa baagundi mee hrudaya vedana.raastuuvumdamdi.

  4. raghu ram sekhar velagaleti అన్నారు:

    ఇంత ఆవేదనతో, ఆర్ద్రతతో పిలిస్తే ఏ ప్రేయసి ఐనా రాకుండా ఉంటుందా చెప్పండి….

  5. Ram అన్నారు:

    Good one Brahmam!.

    Wait for time… U’ll definitely succeed..

  6. Ram అన్నారు:

    Can you post the song which you’ve written on our GMCS Batch?

  7. Upendra అన్నారు:

    Very good song.

  8. Upendra అన్నారు:

    Very beautiful and meaning ful song

  9. brahmam అన్నారు:

    thanks, thanks a lot

ప్రత్యుత్తరమిమ్ము