విజయం కోసం

సాగాలి నీ పరుగు
విజయాన్ని పొందేవరకు
వెయ్యాలి ముందడుగు
ఆనందం అందే వరకు                                    సాగాలి …

అందనంత ఎత్తున ఏది లేదు తెలుసునా
అందుకోను సాధ్యమే చెయ్యి ఆలోచనా
సాధనుంటే చాలుగా అసాధ్యమంటు లేదుగా
ధైర్యముంటె నీవుగా దరికి చేరు త్వరత్వరగా

    నిర్ణయాన్ని తీసుకో నిర్భయంగ సాగిపో            సాగాలి..

తలపడే తపనే ఉంటే తరలిరాద విజయం వెంటే
జాగురతే నీకు ఉంటే జీవితాన నవ్వుల పంటే
అద్భుతాలు చేసే తెలివి నీకూ ఉంది తెలుసుకో
సాధించిన విజయాలన్ని ఒక్కసారి తలచుకో

   నిర్ణయాన్ని తీసుకో నిర్భయంగ సాగిపో       సాగాలి..

యుక్తి తోటి శక్తి తెలుసుకో సత్తువేంటో రుజువు చేసుకో
గెలుపు వైపు మలుపు తీసుకో తీరు చేరు దారి చూసుకో
అలుపెరుగని ఆవేశంతో………
అనుకున్నది వశం చేసుకో………..

   నిర్ణయాన్ని తీసుకో నిర్భయంగ సాగిపో                సాగాలి.. 

7 స్పందనలు to “విజయం కోసం”

  1. వీవెన్ అన్నారు:

    చక్కని ప్రేరణా గీతం!

  2. Aruna Kanthi అన్నారు:

    Chala Bagundi. Daily okasari deenni chadavadam valana mana lo unna shakti yuktulanu ni recharge chesukovachhu. Ilanti prerana geetalu chala avasaram andariki.

  3. Bhavani అన్నారు:

    Mee inspirational song chaala bagundhi…Telugu lo manchi sahithyam oona paatala chaala arudu ga labhisthunayi… mee song chala refreshing ga oondhi chaduvuthuvunte
    it is really nice…people get more motivated from these type of songs…chaala baga rasaru andi ..meeru ilanti paatala manchi bhavardham tho rastharu ani aasisusthu ..Bhavani

  4. Ram అన్నారు:

    Dedicate this to CA Students Brahmam!!!

  5. madhavi అన్నారు:

    This song is really excellant. I motivated a lot with this song. Keep it up

  6. prasadm అన్నారు:

    చాలా బాగా రాసారు. ఎంతో ఉత్సాహాన్నిచ్చేదిగా ఉంది. అభినందనలు.

  7. chavakiran అన్నారు:

    baaguMdi.

ప్రత్యుత్తరమిమ్ము