మనసును అదిమి
కలలను గదిమి
కలిసే క్షణమే
ఆశల వనమై
నే… ఎదురు చూస్తున్నా
నువ్వెప్పుడొస్తావో నా నువ్వెప్పుడొస్తావో… (2)
మనసును అదిమి
మనసు మాట వినదని తెలిసి
లేఖలు వారధిగా చేసి
మమతలన్ని ప్రమిదగ మలచి
మూగతలపు వెలుగుగ చేసి
మౌనరాగమైన వదనంతో…
నే ఎదురు చూస్తున్నా…….
నువ్వెప్పుడొస్తావో నా నువ్వెప్పుడొస్తావో… (2)
మనసును అదిమి
మదిలోని ఆశలన్నీ
అదే పనిగ చెప్పలంటూ
ఎపుడెరుగని భావాలేవో
ఇపుడిపుడే కలిగాయంటూ
నా మనసే తెలిపిన తరుణం లో
నే ఎదురు చూస్తున్నా…….
నువ్వెప్పుడొస్తావో నా నువ్వెప్పుడొస్తావో… (2)
మనసును అదిమి
ఎదురుపడిన తరుణంలోనా
బిడియమాయెనే మనసా
తను కానరాని నిమిషములోనా
కనులు కలియజూసె తెలుసా
నా మనసు తెలిపేదెన్నటికో…
ఐ యాం యిన్ లవ్ విత్ యు…
ఐ యాం యిన్ లవ్ విత్ యు… ఐ యాం యిన్ లవ్ విత్ యు…
7:42 అపరాహ్నం వద్ద నవంబరు 25, 2006
good feel vunna poem.bagaa raasarandi.