డిసెంబరు 10, 2006
తుళ్ళిపడే వయసే మాది
వెళ్ళువయె మనసే మాది
ఎల్లలను దాటి
నింగికెగసేసి
తారలై మెరిసే వరసే మాది తుళ్ళి పడే
ఉడుకు దుడుకు ఉన్న చురుకున్న కుర్రాళ్ళం మేము
సమత మమత ఉన్న మనసున్న మంచోళ్ళం మేమూ
చేయి చాచితే ఆదాన కర్ణులమే మేమూ
ఆచేయె లేపితే చెలరేగే శూరులం మేమూ
ఉల్లాసం ఉంది ఉత్సాహం ఉంది మనసే పడితే గెలిచే ఆరాటం ఉందీ….. తుళ్ళి పడే
మేమెన్నుకున్నరంగం రణరంగం ఏరంగమైనా
ఇక మిన్నకుండకుండా వీరంగం సాగించలేమా
సమరమే వద్దంటే సామ్రాజ్యం నీ సొంతమవునా
సాహసం లేకుంటే యువరాణి నీ రాణవునా……
దమ్మూ ఉందీ ధైర్యం ఉందీ మనసే పడితే గెలిచే ఆరాటం ఉందీ…. తుళ్ళి పడే
అభిప్రాయములు |
Uncategorized |
శాశ్వత లింకు
brahmam యొక్క టపా
డిసెంబరు 4, 2006
ఎదల్లో మాట పెదాల్నే దాటదే… చెలియా
ఒకే ఒక మాట నీతో చెప్పలనీ… మనసు
సదా నీ వెంట పదా అంటున్నదే……
ఉన్నచోట ఉండకుండా
మిన్ను దాటి అందకుండా
రెక్కలున్న గువ్వలల్లే
ఒక్క క్షణం నిలువకుండా
సదా నీ వెంట పదా అంటున్నదే……
ఒకే ఒక మాట నీతో చెప్పలనీ… మనసు
గుండె నిండ నిండి నువ్వు
ఎండలోన నీడైనావు
అలసి సొలసి ఉన్న వేళ
నీ ఊసు చాలు ఉషారివ్వదా
నా పాటలోన పల్లవే నువ్వూ
నా ఆశలన్నీ కలిపితే నువ్వూ అయినా
ఎదల్లో మాట పెదాల్నే దాటదే
మేలుకునే ప్రతి ఉదయాన
నన్నల్లుకున్న నీ ప్రియ ధ్యాన
చెసుకునే ప్రతి పనిలోన
నిను చూసుకున్న నా జతలోన
నా పెదవిపైన నవ్వువూ నువ్వే
నా కళ్ళలోన వెలుగువూ నువ్వే అయినా
ఎదల్లో మాట పెదాల్నే దాటదే
అభిప్రాయములు |
Uncategorized |
శాశ్వత లింకు
brahmam యొక్క టపా