పెదవే దాటని మాట

ఎదల్లో మాట పెదాల్నే దాటదే…  చెలియా
ఒకే ఒక మాట నీతో చెప్పలనీ…  మనసు
సదా నీ వెంట పదా అంటున్నదే……

    ఉన్నచోట ఉండకుండా   
        మిన్ను దాటి అందకుండా
        రెక్కలున్న గువ్వలల్లే
        ఒక్క క్షణం నిలువకుండా
సదా నీ వెంట పదా అంటున్నదే…… 
ఒకే ఒక మాట నీతో చెప్పలనీ…  మనసు

గుండె నిండ నిండి నువ్వు
ఎండలోన నీడైనావు
అలసి సొలసి ఉన్న వేళ
నీ ఊసు చాలు ఉషారివ్వదా
    నా పాటలోన పల్లవే నువ్వూ
    నా ఆశలన్నీ కలిపితే నువ్వూ   అయినా  
                                      ఎదల్లో మాట పెదాల్నే దాటదే

మేలుకునే ప్రతి ఉదయాన
నన్నల్లుకున్న నీ ప్రియ ధ్యాన
చెసుకునే ప్రతి పనిలోన
నిను చూసుకున్న నా జతలోన
     నా పెదవిపైన నవ్వువూ నువ్వే
     నా కళ్ళలోన వెలుగువూ నువ్వే      అయినా
                                            ఎదల్లో మాట పెదాల్నే దాటదే   

2 స్పందనలు to “పెదవే దాటని మాట”

  1. radhika అన్నారు:

    mii paaTalu baagumtunnayi.

  2. వీవెన్ అన్నారు:

    బాగుంది. ఎదల్లో మాట పెదాల్నే దాటదే కంటే ఎదలో మాట పెదవే దాటదే అంటే (భాష పరంగా) బాగుండునేమో.

ప్రత్యుత్తరమిమ్ము