ఫిబ్రవరి 19, 2007
మనసు మనసు పెనవేసి
పెదవి పెదవి జతచేసి
కన్నులు నాలుగు మూసేసి
కడపటి అంచులు దాటేసి
నువ్వూ నేనూ మనమయ్యే ఆ క్షణమే
తనువూ అణువణువూ ఒకటయ్యే పరవశమే
యుగాలైనా క్షణాలయ్యే
సరాగంలో తడిసి… తడిసి… మనసు మనసు పెనవేసి
జాజులు నలిగే జాములో
మోజులు తీరే రేయిలో
హద్దులు మీరిన పరువమా
సిగ్గులు తొడిగిన చైత్రమా
వద్దకు రానని మారమా
నను హత్తుకుపొమ్మని దూరమా…. మనసు మనసు పెనవేసి
ఎదలో దాచిన ఊసులు
పెదవే దాటని ఆశలు
నిలువెల్ల తడిమే శ్వాశలో
అణువణువూ మురిసే ధ్యాసలో
సర్వం మరిచే యాత్రలో
నీలో సగమై నిలిచే రాత్రిలో… మనసు మనసు పెనవేసి
1 వ్యాఖ్య |
Uncategorized |
శాశ్వత లింకు
brahmam యొక్క టపా
ఫిబ్రవరి 19, 2007
పూసే పువ్వుకు ఎందుకె సిగ్గు
సిరు బుగ్గలలోన ఎందుకె నిగ్గు
అరవిరిసిన అందం అందని ఎత్తు
విరబోసిన మనసుకు లేదే హద్దు
ఉహలకందని ఆశలే ఇద్దూ………. పూసే పువ్వుకు ఎందుకె సిగ్గు
రెక్కలు తొడిగెను పువ్వులే
ప్రేమే పండెను ఇక నవ్వులే
వయసే దాచెను వలపులే
మనసంతా నీకై తలపులే
దూరమే నిట్టూర్పులయ్యి
భారమే పెరిగెనే
ప్రాణమే నీ చెలిమి కోసం
ధ్యానమే చేసెనే
వెల్లువైన ప్రియసఖి అల్లరిలో… పూసే పువ్వుకు ఎందుకె సిగ్గు
వెన్నెల చీకటి మనకే
వన్నెలు దాచకు పలుకే
సిగ్గుల మొగ్గవి కాకే
నులి వెచ్చని కౌగిలి నీకే
శ్వాశలోని వేడి దాడి
ఆశలే పెంచెనే
చెప్పలేని భాషలోన
భావమంతా కరిగెనే
అల్లుకున పిల్ల ప్రియబిగిలో……పూసే పువ్వుకు ఎందుకె సిగ్గు
1 వ్యాఖ్య |
Uncategorized |
శాశ్వత లింకు
brahmam యొక్క టపా