మనసు మనసు పెనవేసి

మనసు మనసు పెనవేసి
పెదవి పెదవి జతచేసి
   కన్నులు నాలుగు మూసేసి
   కడపటి అంచులు దాటేసి
నువ్వూ నేనూ మనమయ్యే ఆ క్షణమే
తనువూ అణువణువూ ఒకటయ్యే పరవశమే
  యుగాలైనా క్షణాలయ్యే
  సరాగంలో తడిసి… తడిసి…   మనసు మనసు పెనవేసి

జాజులు నలిగే జాములో
మోజులు తీరే రేయిలో
హద్దులు మీరిన పరువమా
సిగ్గులు తొడిగిన చైత్రమా  
    వద్దకు రానని మారమా
    నను హత్తుకుపొమ్మని దూరమా…. మనసు మనసు పెనవేసి

ఎదలో దాచిన ఊసులు
పెదవే దాటని ఆశలు
నిలువెల్ల తడిమే శ్వాశలో
అణువణువూ మురిసే ధ్యాసలో
    సర్వం మరిచే యాత్రలో
    నీలో సగమై నిలిచే రాత్రిలో… మనసు మనసు పెనవేసి   
   

ఒక స్పందన to “మనసు మనసు పెనవేసి”

  1. G. Kishore అన్నారు:

    brahamaim, u have disclosed full info. here, however it is wondrafull.

ప్రత్యుత్తరమిమ్ము