వేకువ వాకిటి ముగ్గులా
సాయం సంధ్యపు పొద్దులా
జాబిలి ముద్దుల చెల్లిలా
నను మైమరపించిన వెన్నెలా
ఐ లవ్ యు లవ్ యు రా……
ఒకపరి నవ్వుల పువ్వులా
తదుపరి కోపపు ఝల్లులా
యోచనకందని చందనా
నన్నూరించకే వందనా
నే నేనేనా నువ్వయ్యానా….
తలపులు తాకే వేళ
మది తలుపులు వేస్తావేళ
కళ కళలాడే కవితా
మరి కవ్వించకే మ్రధులలితా
వేకువ వాకిటి ముగ్గులా
సాయం సంధ్యపు పొద్దులా
జాబిలి ముద్దుల చెల్లిలా
నను మైమరపించిన వెన్నెలా
ఐ లవ్ యు లవ్ యు రా……
6:28 అపరాహ్నం వద్ద ఏప్రియల్ 30, 2007
“తలపులు తాకే వేళ
మది తలుపులు వేస్తావేల”
చాలా బాగుంది.
7:26 పూర్వాహ్నం వద్ద మే 9, 2007
చాలా బాగుంది
6:17 పూర్వాహ్నం వద్ద మే 18, 2007
చాలా బాగున్నాయి మీ కవితా పాటలు పాడుకోవటానికి. ఒక మంచి తెలుగు ఘజల్ వ్రాయగలరు గానం చేసుకోవడానికి.
1:48 అపరాహ్నం వద్ద మే 23, 2007
Good, define a beautiful girl