నువ్వెప్పుడొస్తావో

నవంబరు 25, 2006

మనసును అదిమి
కలలను గదిమి
కలిసే క్షణమే
ఆశల వనమై
నే… ఎదురు చూస్తున్నా

నువ్వెప్పుడొస్తావో నా నువ్వెప్పుడొస్తావో…    (2)
                         మనసును అదిమి

మనసు మాట వినదని తెలిసి
లేఖలు వారధిగా చేసి
మమతలన్ని ప్రమిదగ మలచి
మూగతలపు వెలుగుగ చేసి
మౌనరాగమైన వదనంతో…

నే ఎదురు చూస్తున్నా…….

నువ్వెప్పుడొస్తావో నా నువ్వెప్పుడొస్తావో…    (2)
                         మనసును అదిమి

మదిలోని ఆశలన్నీ
అదే పనిగ చెప్పలంటూ
ఎపుడెరుగని భావాలేవో
ఇపుడిపుడే కలిగాయంటూ
నా మనసే తెలిపిన తరుణం లో
నే ఎదురు చూస్తున్నా…….

నువ్వెప్పుడొస్తావో నా నువ్వెప్పుడొస్తావో…     (2)
                         మనసును అదిమి
 ఎదురుపడిన తరుణంలోనా
బిడియమాయెనే మనసా
తను కానరాని నిమిషములోనా
కనులు కలియజూసె తెలుసా
నా మనసు తెలిపేదెన్నటికో…

ఐ యాం యిన్ లవ్ విత్ యు… 

ఐ యాం యిన్ లవ్ విత్ యు…  ఐ యాం యిన్ లవ్ విత్ యు…


కమ్మని కలలో

నవంబరు 18, 2006

కమ్మని కలలో
వన్నెల చిన్నది వద్దకి చేరింది
మనసిమ్మని నన్ను
అల్లరి చేస్తూ మారాం చేసింది         కమ్మని

చూస్తాడు మా నాన్నా
లేస్తాడు మా అన్నా
తిడుతుంది అమ్మమ్మ
వింటుంది మా అమ్మా
అన్నా నేనన్నా తన అందం అంద జేసిందయ్యొ        కమ్మని 

తన అందమే అందం
నిలువెత్తు సౌందర్యం
తన వదనమే మధురం
విరిసేటి ఓ కమలం
అయ్యో అయ్యయ్యో నన్నే మాయ జేసిందయ్యో        కమ్మని

తానంటే నేనంది
నేనంటే తానంది
చేరువవుతానంది
చేజారి పోయింది
కలా నన్నలా మళ్లీ ఒంటరివాడ్ని చేసిందయ్యో  అయ్యొ అయ్యో అయ్యయ్యో   

కమ్మని కలలో
వన్నెల చిన్నది వద్దకి చేరింది
ముద్దిమ్మని  నన్ను
అల్లరి చేస్తూ అలజడి రేపిందీ                                          


విజయం కోసం

నవంబరు 13, 2006

సాగాలి నీ పరుగు
విజయాన్ని పొందేవరకు
వెయ్యాలి ముందడుగు
ఆనందం అందే వరకు                                    సాగాలి …

అందనంత ఎత్తున ఏది లేదు తెలుసునా
అందుకోను సాధ్యమే చెయ్యి ఆలోచనా
సాధనుంటే చాలుగా అసాధ్యమంటు లేదుగా
ధైర్యముంటె నీవుగా దరికి చేరు త్వరత్వరగా

    నిర్ణయాన్ని తీసుకో నిర్భయంగ సాగిపో            సాగాలి..

తలపడే తపనే ఉంటే తరలిరాద విజయం వెంటే
జాగురతే నీకు ఉంటే జీవితాన నవ్వుల పంటే
అద్భుతాలు చేసే తెలివి నీకూ ఉంది తెలుసుకో
సాధించిన విజయాలన్ని ఒక్కసారి తలచుకో

   నిర్ణయాన్ని తీసుకో నిర్భయంగ సాగిపో       సాగాలి..

యుక్తి తోటి శక్తి తెలుసుకో సత్తువేంటో రుజువు చేసుకో
గెలుపు వైపు మలుపు తీసుకో తీరు చేరు దారి చూసుకో
అలుపెరుగని ఆవేశంతో………
అనుకున్నది వశం చేసుకో………..

   నిర్ణయాన్ని తీసుకో నిర్భయంగ సాగిపో                సాగాలి.. 


నా హృదయమా

నవంబరు 6, 2006

హృదయమిలా ప్రతి ఉదయంలా
నీ కోసమే అది విరిసినది
  నీ ధ్యాసలోనే…  నేనన్నది లేనన్నది
                              నిజమిది….
                             హృదయమిలా….
పరువంలో పరిమళమే పదిలంగా దాచానే
పరిచయమే లేనట్టే పొంకాలే పోతావే
పరువంలో పరిమళమే పదిలంగా దాచానే
పరిచయమే లేనట్టే పొంకాలే పోతావే

వానవిల్లువా తేనె జల్లువా
మౌన దేవతా మనవి తీర్చలేవా??
                            కాదనక….
                            లేదనక…
                               అవుననవా….
హృదయమిలా ప్రతి ఉదయంలా
నీ ధ్యాసలోనే నేనన్నది లేనన్నది
                              నిజమిది….
                             హృదయమిలా…
అనుదినమూ నీ నామం జపమాలై జపించానే
అణువణువూ నీకోసం తపస్వినై తపించానే
అనుదినమూ నీ నామం జపమాలై జపించానే
అణువణువూ నీకోసం తపస్వినై తపించానే

నీలవేణివా కృష్ణవేణివా    
రాగమాలికై నా రాగమందుకోవా??
                            కాదనక…
                            లేదనక…
                               అవుననవా….
                            హృదయమిలా…


స్నేహమాధురి

అక్టోబర్ 28, 2006

స్నేహమాధురి స్వరాల లాహిరి
నీ పలకరింపు తోనె నన్ను పులకరించనీ
హృదయ నిచెలి
సవినయ కోమలి
నీ చెలిమి చలువలోనె నన్ను సేదతీరనీ
                                   స్నేహమధురి

వెనక జన్మలోన ఉన్న తీపి గురుతునీ
నిన్న నేడు రేపు లేదు మరచిపొమ్మనీ
నాకు నువ్వు తోడువన్న ఊహ నిజమనీ
నన్ను నేను మరచి పోయి పాడనివ్వనీ
                                  స్నేహమధురి

ఇంత అంత ఎంత ఐన అంతు లేదనీ
ఇంక ఏదొ అడుగుతున్న మనసు కొరతనీ
తీర్చలేవ మార్చలేని పిచ్చి ఆశని
దరి చేర రావ వేచి ఉన్న గుండె గూటినీ  
                               స్నేహమధురి

చేరలేని దూరమున్న నీ చెలిమిని
చేరుకోను దారిలేక దూరమైతిని
మరు జన్మకైన మాట నిలుపుకుంటావని
మనసునంత మాయ చేసి రాయినైతిని
                                స్నేహమధురి
 


Hello world!

జులై 20, 2006

Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!